News August 4, 2024
HYD: యామినీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన CM
పద్మ పురస్కారాల గ్రహీత, ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల రాష్ట్ర CM రేవంత్ రెడ్డి HYDలో సంతాపం తెలిపారు. భరత నాట్య, కూచిపూడి నృత్య కళకు యామినీ విశిష్ట సేవలందించారని, ఎంతో మంది యువతకు నాట్యం నేర్పించి దేశంలోనే కళారంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
Similar News
News September 15, 2024
HYD: శంషాబాద్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్
HYD శివారు శంషాబాద్ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. RGIA సమీపాన దాదాపుగా 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే ఓ ఆఫీస్ టవర్ నిర్మాణం ప్రారంభం కాగా.. 2025-26 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ఇంజినీరింగ్ బృందం కసరత్తు చేస్తోంది. మరోవైపు నగరంలో AI సిటీ సైతం నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
News September 15, 2024
RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS
✓NIMS ఆస్పత్రిలో SEP 22 నుంచి 28 వరకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
✓ఖైరతాబాద్ గణేష్ వద్దకు తరలిన జనం
✓బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న రాష్ట్ర DGP
✓SEP 17న గ్రేటర్ HYD పరిధిలో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
✓బోడుప్పల్: వక్ఫ్ బాధితులను కలిసిన ఎంపీ DK అరుణ
✓KPHB: గణపతి నిమజ్జనంలో ముస్లిం సోదరుల డాన్స్.
News September 14, 2024
HYD నగరంలో DGP పర్యటన
HYD నగర వ్యాప్తంగా డీజీపీ జితేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గణపతి నిమజ్జనానికి చేపడుతున్న ఏర్పాట్లు,బందోబస్తు గూర్చి పరిశీలించారు.చార్మినార్, బాలాపూర్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సిపిలతో కలిసి పరిస్థితులు పరిశీలించారు. నిమజ్జనం, ఊరేగింపు సాఫీగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. పర్యటనలో సీపీలు సుధీర్ బాబు, సివి ఆనంద్, కలెక్టర్ అనుదీప్, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు.