News March 2, 2025

HYD: యువకుడితో పరారైన 35 ఏళ్ల వివాహిత

image

ఓ వివాహిత యువకుడితో పరారైన ఘటన మేడ్చల్ పేట్‌బషీరాబాద్‌లో జరిగింది. KPHBలో ఉంటున్న పల్నాడుకు చెందిన గోపి(22)కి వరంగల్‌‌కు చెందిన సుకన్య(35)కు ఓ యాప్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. FEB 5న గోపిని కలిసేందుకు సుకన్య వస్తుందని గుర్తించిన భర్త వారిని వెంబడించాడు. బైక్‌పై వెళ్తుండగా.. భర్త అడ్డుకోవడంతో బైక్ వదిలేసి ఇద్దరు పరారయ్యారు. భర్త పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News November 7, 2025

వందేమాతరాన్ని ఆలపించిన నెల్లూరు కలెక్టర్

image

స్వాతంత్య్ర సంగ్రామంలో భారతీయులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన దేశభక్తి గేయం వందేమాతరం అని నెల్లూరు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కొనియాడారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాన్ని శుక్రవారం ఉదయం ఆలపించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.

News November 7, 2025

తరచూ ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా?

image

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్‌లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్‌కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News November 7, 2025

నిజామాబాద్: మలావత్ పూర్ణకు పితృ వియోగం

image

అత్యంత పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.