News March 2, 2025

HYD: యువకుడితో పరారైన 35 ఏళ్ల వివాహిత

image

ఓ వివాహిత యువకుడితో పరారైన ఘటన మేడ్చల్ పేట్‌బషీరాబాద్‌లో జరిగింది. KPHBలో ఉంటున్న పల్నాడుకు చెందిన గోపి(22)కి వరంగల్‌‌కు చెందిన సుకన్య(35)కు ఓ యాప్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. FEB 5న గోపిని కలిసేందుకు సుకన్య వస్తుందని గుర్తించిన భర్త వారిని వెంబడించాడు. బైక్‌పై వెళ్తుండగా.. భర్త అడ్డుకోవడంతో బైక్ వదిలేసి ఇద్దరు పరారయ్యారు. భర్త పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News March 21, 2025

BREAKING.. WNP: రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతి

image

పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో జూరాల కాలువ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని చెలిమిల్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ హనుమంతు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికు తరలించారు. 

News March 21, 2025

ప.గో జిల్లాలో ఉగాది పురస్కారాలకు ఎంపికైన అధికారులు

image

పశ్చిమగోదావరి జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ HC అప్పారావు, DAR ARPC వెంకట రామకృష్ణ, పాలకొల్లు ఫైర్ ADFO జానకిరామ్, తణుకు టౌన్ PS HC నరసింహారాజు, జిల్లా ARSI నాగేశ్వరరావు. కొవ్వూరు డివిజన్ లోని ఉండ్రాజవరం PS ASI రామకృష్ణ, చాగల్లు PS ASI రాజేంద్రప్రసాద్‌లు ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని అధికారులు తెలిపారు.

News March 21, 2025

స‌జావుగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు: కలెక్టర్ 

image

ఎన్టీఆర్ జిల్లాలో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో స‌జావుగా సాగుతున్నాయ‌ని, పొర‌పాట్ల‌కు తావులేకుండా ప‌రిస్థితిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ సూర్యారావుపేట‌లోని క‌ర్నాటి రామ్మోహ‌న్‌రావు మునిసిప‌ల్ ఉన్న‌త‌పాఠ‌శాల ప‌రీక్ష కేంద్రంలో ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. విద్యార్థులు ప‌రీక్ష రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను అయన ప‌రిశీలించారు. 

error: Content is protected !!