News July 2, 2024

HYD: యువతిపై అత్యాచారం.. నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష

image

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి వంశీకృష్ణ(19) HYD హయత్‌నగర్ శాంతినగర్‌లో ఉంటూ మెకానిగ్‌గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2 రోజులు రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RR జిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.

Similar News

News October 18, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిపై రంగారెడ్డి కలెక్టర్ సమీక్ష

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన పురోగతి సాధించాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో ఇబ్రహీంపట్నంలోని కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. మండలాల వారీ మంజూరైన ఇళ్ల సంఖ్య, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెనుకంజలో ఉన్న మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 17, 2025

రంగారెడ్డి: స్వీట్ షాప్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్

image

దీపావళి పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాల్లో జిల్లా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. తయారీకి ఉపయోగించే పదార్థాలు, నాణ్యతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రజలు స్వీట్స్ కొనేముందు వాటి నాణ్యతను గమనించి కొనాలని, తినే పదార్థాల్లో నాణ్యత లోపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. జోనల్ ఆఫీసర్ ఖలీల్, జిల్లా అధికారి మనోజ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్ పాల్గొన్నారు.

News October 16, 2025

RR: మద్యం దుకాణాలకు టెండర్లు పోటీ

image

సరూర్‌నగర్ ఎక్సైస్ జిల్లాలో 138 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇప్పటివరకు 1300కిపైగా దరఖాస్తులు అందినట్లు DPEO ఉజ్వల రెడ్డి తెలిపారు. సరూర్‌నగర్‌లో 32కి 500, హయత్‌నగర్ 28కి 510, ఇబ్రహీంపట్నంలో 19కి 100, మహేశ్వరంలో 14కి 150, అమన్‌గల్ 17కి 50, షాద్‌నగర్ 28కి 100 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మరో 2 రోజుల సమయం ఉండటంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.