News July 2, 2024
HYD: యువతిపై అత్యాచారం.. నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నల్గొండ వాసి వంశీకృష్ణ(19) HYD హయత్నగర్ శాంతినగర్లో ఉంటూ మెకానిక్గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2 రోజులు రూమ్లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RR జిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News October 23, 2025
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్

BA, B.COM, BSC చదువుతున్న విద్యార్థులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్న్యూస్ ప్రకటించింది. 2019-24 మధ్యలో చేరిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును నవంబర్ 13లోపు చెల్లించాలని స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ వెబ్ సైట్లో పూర్తి వివరాలున్నాయన్నారు. సందేహాలుంటే 040-23680333 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్లో KCR ఫినిషింగ్ టచ్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రతి ఇంటి తలుపు తట్టాలని నిర్ణయించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే సమయాలను ఇందుకు అనువుగా ఉంటుందని భావిస్తోంది. ఇక ప్రచారం చివరి దశలో పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో ఉండేలా ప్లాన్ రూపొందించినట్లు తెలిసింది. అయితే ఎప్పుడు అనే విషయంపై సమాచారం రావాల్సి ఉంది.
News October 23, 2025
HYD: ఇద్దరు పిల్లలు మృతి.. తల్లడిల్లిన తల్లి

హైదరాబాద్ శివారులోని సాగర్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం తమ్మలోనిగూడ గేటు వద్ద ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రికి గాయాలు అయ్యాయి. ఇద్దరు పిల్లలు అభిరామ్(9), రామ(5) అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపు మడుగులో ఉన్న పిల్లలను చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు చలించిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.