News July 3, 2024
HYD: యువతిపై లైంగిక దాడి.. పోలీసులకు ఫిర్యాదు

ఓ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న యువతిపై హాస్టల్ నిర్వాహకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన HYD ఘట్‌కేసర్ సమీపంలోని మేడిపల్లి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి(20) పీర్జాదిగూడ బుద్ధానగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న పీజీ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. రాత్రి హాస్టల్ నిర్వాహకుడు యువతిపై లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె బంధువులు PSలో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 16, 2026
రంగారెడ్డిలో రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు RR కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని SC కార్పొరేషన్ ED పద్మావతి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT
News March 14, 2026
పది పరీక్షలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు: రంగారెడ్డి DEO

పదోతరగతి పరీక్షలకు ఉదయం 9:35 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్ రావు అన్నారు. ప్రతి సెంటర్‌ను ఒక సిట్టింగ్ స్క్వాడ్ సహా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో పది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చూచిరాతలు, చీటీలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు తెలిపారు.
News March 14, 2026
RR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం వాటిని ఖాళీ చేసి, సొంతూళ్లకు పయనమయ్యారు. రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఫస్టియర్‌లో 84,301 మంది, సెకండియర్‌లో 70,171 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 200 పరీక్ష కేంద్రాల్లో 96 శాతం మంది హజరయ్యారు.


