News July 23, 2024
HYD: యువతులను వేధించేవారికి హెచ్చరిక
యువతులు, మహిళలను వేధించే పోకిరీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాచకొండ CP సుధీర్ బాబు హెచ్చరించారు. మంగళవారం ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. షీటీమ్స్ గత 15 రోజుల్లో 158 మంది ఆకతాయిల ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో డెకాయ్ ఆపరేషన్లు చేపట్టామన్నారు. పట్టుబడ్డవారికి నేడు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News November 28, 2024
HYD: 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య
వచ్చే డీఎస్సీలో 26 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. ఏ పాఠశాలకు వెళ్లినా టీచర్ల కొరత ఉందన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో 6 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదన్నారు.
News November 28, 2024
HYD: జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి సమావేశం
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధిపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి, R&B ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. అధికారులతో కలిసి వారు భువనగిరి పరిధిలోని రహదారుల అభివృద్ధి, మరమ్మతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News November 28, 2024
HYD: వర్ణ వివక్షతపై ఫులే అలుపెరగని పోరాటం చేశారు: KTR
మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆ మహానీయుడి చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వర్ణ వివక్షతను రూపుమాపడం కోసం, దళిత, బహుజన, మహిళా వర్గాల అభ్యున్నతి కోసం, మహాత్మా ఫులే కార్యాచరణ మహోన్నతమైనదని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.