News May 11, 2024

HYD: యువతుల ఫొటోలు మార్ఫింగ్.. యువకుడి అరెస్ట్

image

యువతుల ఫొటోలను అశ్లీలంగా మార్చుతున్న యువకుడిని HYD మేడిపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సరూర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అర్షద్ (23) ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిల ఫొటోలు సేకరించి, నగ్న చిత్రాలుగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు. ఈ విషయంపై ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి అర్షద్‌ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 12, 2025

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ శ్రవణ్ మృతి

image

ఈనెల 9న సికింద్రాబాద్​ ప్యాట్నీ సెంటర్‌‌లోని కామాక్షి సిల్క్స్​ క్లాత్​ షోరూమ్​‌లో పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన శ్రవణ్​ కుమార్​(37) మంగళవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు. శ్రవణ్​ 98 శాతం కాలిన గాయాలతో ఆదివారం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్​ అయ్యాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మార్కెట్ పీఎస్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేందర్​ తెలిపారు.

News February 11, 2025

హైదరాబాద్‌లో రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్ సీజ్..

image

హైదరాబాద్‌లో విదేశీ సిగరెట్ల గుట్టును కమిషనర్ టాస్క్‌ఫోర్స్, సౌత్ వెస్ట్ జోన్, హాబీబ్ నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో రట్టు చేశారు. రూ.20 లక్షల విలువైన విదేశీ సిగరేట్స్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అఫ్సల్ నగర్, అగపురా రోడ్డులో ఓ గోదాంలో విదేశీ సిగరేట్స్ నిల్వ ఉంచారు. ఈ మేరకు నిందితులు ఇమ్రాన్, ఆయుబ్‌ను అరెస్ట్ చేశారు.  

News February 11, 2025

ఎల్బీనగర్‌: మైనర్ బాలికపై లైంగిక దాడి.. జీవిత ఖైదు

image

ఎనిమిదేళ్ల మైనర్ బాలికను మాయమాటలతో ఆశచూపి, అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ షేక్ జావీద్(27) దోషి అని తేలడంతో అతడిపై అత్యాచారం, పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదైంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు, రూ.25వేల జరిమానా, బాధితురాలకి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని తీర్పునిచ్చింది.

error: Content is protected !!