News August 23, 2024

HYD: యూట్యూబర్ వంశీ కుమార్ ARREST

image

కూకట్‌పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై డబ్బులు విసిరి న్యూసెన్స్ క్రియేట్ చేసిన వంశీ కుమార్ (24) అనే యువకుడిని ఈరోజు అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు వెదజల్లే వీడియోలను పోస్ట్ చేయడంతోపాటు ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు కూకట్‌పల్లి సీఐ ముత్తు వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేస్తే సహించబోమని హెచ్చరించారు.

Similar News

News January 22, 2025

HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర

image

HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.

News January 22, 2025

HYD: పజ్జన్నను ఫోన్‌లో పరామర్శించిన కేటీఆర్

image

డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విషయాన్ని తెలుసుకున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పద్మారావుగౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స అనంతరం ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని పద్మారావుగౌడ్ కేటీఆర్‌కు తెలిపారు. తగిన విశ్రాంతి తీసుకొని మళ్లీ కార్యక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ఆయనకు సూచించారు.

News January 22, 2025

జనవరి 25న నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తాం: CEO

image

జనవరి 25వ తేదీన HYDలో భారీ ఎత్తున నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించి ఓటు హక్కుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎలక్షన్ అధికారులకు సమావేశంలో ఆదేశించారు.