News August 3, 2024
HYD: యూనివర్సిటీలో 85 శాతం సీట్లు తెలంగాణ వారికే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1722650262653-normal-WIFI.webp)
HYD మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం 2024-25 నుంచి 85% సీట్లు తెలంగాణ స్థానికత ఉన్నవారికే కేటాయించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇది అమలులోకి వచ్చిందని తెలిపారు. 15% అన్ రిజర్వుడ్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2024
దద్దరిల్లుతున్న హైదరాబాద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1726533298765-normal-WIFI.webp)
వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.
News September 17, 2024
HYD విలీనమా.. విమోచనమా.. విద్రోహమా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1726481384907-normal-WIFI.webp)
‘ఆపరేషన్ పోలో’లో భాగంగా 1948-09-17న హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఇది జరిగి 76 ఏళ్లు పూర్తయినా ప్రతి ఏడాది కొత్త చర్చనే. విలీనమంటూ INC, సమైక్యత అని BRS-MIM, విమోచనమని BJP, సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, విద్రోహమని నిజాం పాలకుల మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. ఈ వ్యవహారంలో మీ మద్దతు ఏ పార్టీకి ఇస్తారు..? కామెంట్ చేయండి.
News September 16, 2024
HYD: బాలాపూర్ లడ్డూ వేలం పాటకు కొత్త రూల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1726504256631-normal-WIFI.webp)
బాలాపూర్ గణపతి ఉత్సవంలో లడ్డూ వేలం వెరీ స్పెషల్. 1994లో రూ.450తో మొదలై 2023లో రూ.27 లక్షలకు పలికింది. అయితే, ఈసారి లడ్డూ వేలంపాటలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా గత సంవత్సరం పలికిన డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉందని నిర్వాహకులు తెలిపారు. బాలాపూర్ గ్రామ ప్రజలతో పాటు, ఎవరైనా ఈ వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలాపూర్ లడ్డూ వేలంపాట రేపు ఉదయం 9:30కు ప్రారంభం కానుంది.