News October 25, 2024
HYD: యూనివర్సిటీల నూతన వీసీలతో గవర్నర్
ప్రభుత్వం ఇటీవల 9 యూనివర్సిటీలకు నూతన వీసీలను నియమించింది. తాజాగా వారందరూ ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టారు. HYDలోని రాజ్‌భవన్ నుంచి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపుమేరకు వీసీలు రాజ్ భవన్లో గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్కిల్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టాలని వారికి సూచించారు. ఇందులో వీసిలు కుమార్, నిత్యానందరావు, యాదగిరి రావు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2024
HYDలో జాన్వీ కపూర్ పూజలు
జూబ్లీహిల్స్, వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయానికి శ్రీదేవి కుమార్తె, దేవర ఫేమ్ జాన్వీ కపూర్ వచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు అర గంటపాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా గుడి వద్దకు చేరుకున్నారు. స్థానికులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
News November 7, 2024
HYD: నూతన టెక్నాలజీతో లీకేజీలకు అడ్డుకట్ట..!
HYD నగర ప్రజలకు మంచి నీటి సమస్య రాకుండా జలమండలి చర్యలు చేపడుతోంది. గండిపేట కాండ్యూట్ లీకేజీలతో 8ఎంజీడీ (30 లక్షల లీటర్లు) నీరు వృథా అవుతుందని గుర్తించిన అధికారులు, గ్రౌటింగ్ పద్ధతిలో కెమికల్ ట్రీట్మెంట్ టెక్నాలజీ ఉపయోగించి నీటి సరఫరాకు అంతరాయం కలిగించకుండా మరమ్మతులు చేస్తున్నారు. ఈ లీకేజీలు దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవున ఉన్నట్లు గుర్తించామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
News November 6, 2024
HYD: RRR దక్షిణ భాగం నిర్మాణంపై మరో ముందడుగు!
HYD శివారులో RRR దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అలైన్మెంట్ సహా ఇతర అన్ని పనుల పర్యవేక్షణ కోసం త్వరలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. RRR దక్షిణ భాగాన్ని తన ఆధ్వర్యంలోనే నిర్మించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేక IAS అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది.