News February 3, 2025

HYD: యూరిన్ శాంపిల్ లేకుండానే ఇన్ఫెక్షన్ల గుర్తింపు!

image

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో యూరిన్ శాంపిల్ తీసుకోకుండానే మూత్ర ఇన్ఫెక్షన్లను గుర్తించి HYD సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా సైన్వి బయోసైన్స్, ఆస్ పైర్ బయోనెస్ట్ సంయుక్తంగా మోడల్ ఆవిష్కరించింది. 2024లో జరిగిన ఏఐ ఆధారిత ఆవిష్కరణల్లో ప్రపంచ స్థాయిలో 24వ ర్యాంకును ఈ మోడల్ దక్కించుకుంది. రాబోయే రోజుల్లో ఏఐ అద్భుతాలు సృష్టించబోతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

Similar News

News March 6, 2026

అభిషేక్ మాదిరే వరుణ్‌ను ఎందుకు సపోర్ట్ చేయరు: సెహ్వాగ్

image

నిన్న ENGతో మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటిపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సరిగ్గా ఆడట్లేదు. అతడిని వెనకేసుకొస్తున్న వారికి బౌలర్‌కు సపోర్ట్ చేయడానికి ఎందుకు సమస్య? 3 మ్యాచ్‌లలో రన్స్ ఇవ్వగానే వేరే బౌలర్ కోసం చూస్తున్నామని చెబుతారు. ఆ కొత్త ప్లేయర్ రాణిస్తాడనే గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నించారు.

News March 6, 2026

KNR: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

చొప్పదండి మండల పరిధిలోని చాకుంట ఎక్స్ రోడ్డు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన టిప్పర్.. ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు.

News March 6, 2026

సంగారెడ్డి: కాలుష్యంపై నిర్లక్ష్యం వద్దు: ఎంపీ

image

సంగారెడ్డి నుంచి బీహెచ్ఈఎల్ వరకు పెరిగిపోతున్న కాలుష్యంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షలో ఆయన మాట్లాడారు. కంకర మిషన్ల వద్ద దుమ్ము వెదజల్లుతున్నా పొల్యూషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సంగారెడ్డి కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.