News July 4, 2024
HYD: రంగంలోకి డీఆర్ఎఫ్ బృందాలు
వర్షాల నేపథ్యంలో రోడ్లపై భారీగా నిలిచే నీళ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా జలమండలి డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. ఇప్పటికే వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 238 స్టాటిక్, 154 మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు వర్షపు నీటి తొలగింపులో నిమగ్నమయ్యాయి. రాత్రి నగరంలో పలుచోట్ల కురిసిన వర్షానికి నీరు నిలిచిన ప్రాంతాల్లో ఈ బృందాలు నీటిని తొలగించాయి.
Similar News
News November 14, 2024
HYD: అక్కడేమో పూజలు.. ఇక్కడేమో ఇలా..!
VKB అనంతగిరి కొండల్లో పుట్టిన మూసికి అక్కడికి వెళ్లిన పర్యటకులు పూలు చల్లి పూజలు చేసి, స్వచ్ఛమైన నీటితో దైవాభిషేకం చేస్తున్నారు. మరి అదే మూసీ.. VKB ప్రాంతంలో పూజలు చేసిన వారే.. HYDలో మూసీని చూడగానే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. PCB ప్రమాణాలకు మించి మూసీ కలుషితమైంది. దీంతో HYDలో 55KM మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ప్రభుత్వం అంటుంది.
News November 13, 2024
HYD: సీపీ ఫోటోతో సైబర్ నేరగాళ్ల దందా.. జాగ్రత్త..!
HYD సీపీ ఆనంద్ ఫోటోతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఫేక్ నంబర్లతో కాల్ చేసి, అమాయక వ్యక్తులకు వలవేస్తున్నారు. దీనిపై స్పందించిన సీపీ.. డబ్బు, బ్యాంకు వివరాలు అడగటం కోసం, ఇతర పర్సనల్ సమాచారం అడగటానికి ఏ అధికారి కాల్ చేయరని, అలాంటి వాటిని నమ్మొద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
News November 13, 2024
ఓయూలో త్వరలో సంస్కరణలు: వీసీ
తార్నాక ఉస్మానియా యూనివర్సిటీలో త్వరలో సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు వీసీ ప్రొ.ఎం.కుమార్ వెల్లడించారు. ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ హాజరు తదితర అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. VC బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఠాగూర్ ఆడిటోరియంలో అధ్యాపకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న న్యాక్ గుర్తింపులో ఉత్తమ రేటింగ్ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.