News February 13, 2025
HYD: రంగరాజన్‌పై దాడి.. 12 మంది అరెస్ట్

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడి కేసులో ఇప్పటివరకు పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 14 మంది పరారీలో ఉన్నారు. వీరిలో భద్రాచలం వద్ద మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Similar News
News March 26, 2025
HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 26, 2025
సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
News March 26, 2025
మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: ఇలంబర్తి

వర్షాకాలంలో నగర వాసుల కష్టాలను తొలగించే విధంగా మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇటంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ, మాన్‌సూన్ యాక్షన్‌ప్లాన్, నాలా పూడికతీత, నాలా భద్రతా చెరువుల పునరుద్ధరణ అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి కమిషనర్ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే పలు సమస్యలపై చర్చించారు.