News November 27, 2024

HYD, రంగారెడ్డి రీజియన్: RTCలో 289 కాంట్రాక్ట్ ఉద్యోగాలు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. HYD రీజియన్‌లో 117, ఉమ్మడి RRలో 172 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

Similar News

News December 5, 2024

దిక్షాంత్ పరేడ్‌లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

image

హైదరాబాద్ చంచల్ గూడ సెంట్రల్ జైల్లో సికా పెరేడ్ గ్రౌండ్‌లో జైల్ ట్రైనీ వార్డార్డ్స్ దీక్షంత్ పరేడ్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షంత్ పరేడ్‌లో శిక్షణ పొందిన జైల్ వార్డార్డ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైల్ వార్డార్డ్‌కి మెడల్స్ ప్రదానం చేశారు.

News December 5, 2024

ములుగు ఎన్కౌంటర్ బూటకం: ప్రొ. హరగోపాల్

image

డిసెంబర్ 1న ఏటూరు నాగారం చల్వాక ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టులపై విషహారం ప్రయోగించి, బంధించి, హింసించి చేసిన హత్యాకాండే అని తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొ. హరగోపాల్ ఆరోపించారు. NSSలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మార్చి 2026 వరకు నక్సలైట్లను ఏరివేస్తామని స్వయంగా హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారని, అందులో భాగంగానే బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. నారాయణ రావు ఉన్నారు.

News December 5, 2024

HYD: ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న వర్సిటీ రిజిస్ట్రార్…!

image

JNTU రిజిస్ట్రార్ తీరు పై వర్సిటీ డైరెక్టర్ లే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వర్సిటీలు డైరెక్టర్లకు కార్లు, డ్రైవర్ల కేటాయింపులో రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వివక్ష చూపిస్తున్నారని కొందరు డైరెక్టర్లు ఆరోపించారు. బుధవారం రిజిస్ట్రార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈవిషయం చర్చకు రాగా సమావేశం కాస్త రసాభాసగా మారింది. వర్సిటీలో పాలనాపరంగా రిజిస్ట్రార్ ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఆరోపించారు.