News March 29, 2024

HYD: రంజాన్ జోష్.. అత్తర్లకు క్రేజ్

image

రంజాన్ నేపథ్యంలో పాతబస్తీలో అత్తర్లఅమ్మకాలు జోరందుకున్నాయి. పాతబస్తీ అనగానే మొదటగా గుర్తొచ్చేది వీటి పరిమళాలే. ఇక్కడ దాదాపు 500 రకాలకుపైగా అత్తర్లు లభిస్తున్నాయి. ఇక్కడి దుకాణాల్లో సహజ సిద్ధంగా తయారు చేసిన అత్తర్లతో పాటు సింథటిక్ అత్తర్లు లభిస్తున్నాయి. 10 మి.లీ రూ.160 నుంచి రూ.4000 ధర పలికే అత్తర్లు ఈ పండగ సీజన్లో వెనువెంటనే అమ్ముడవుతున్నాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News January 24, 2025

HYD: ఇన్‌స్టాలో అశ్లీల వీడియోలు.. ARREST

image

ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చిన్నారుల అశ్లీల నృత్యాలు షేర్ చేసిన HYD వాసులు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఓ వ్యాపారి పోర్న్ చూస్తున్నారు. చిన్నారుల అశ్లీల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. గుర్తించిన NCMEC(National Center for Missing & Exploited Children) సైబర్ క్రైమ్‌ PSలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు.

News January 24, 2025

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌

image

హైదరాబాద్‌లో చికెన్ ధరలు‌ కొండెక్కాయి. గత నెల రోజులుగా KG రూ. 200కు పైగానే అమ్ముతున్నారు. స్కిన్‌లెస్ రూ. 245 నుంచి రూ. 250 మధ్య విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 215 నుంచి రూ. 230 మధ్య అమ్మకాలు జరుపుతున్నారు. శుక్రవారం ఫాంరేట్ KG రూ. 127, రిటైల్ KG రూ. 149‌గా నిర్ణయించారు. మీ ఏరియాలో‌ ధరలు ఏ విధంగా ఉన్నాయి.
SHARE IT

News January 23, 2025

HYD ఎయిర్‌పోర్ట్‌లో సందర్శకులకు నో ఎంట్రీ

image

గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT