News April 11, 2024
HYD: రంజాన్ మాసంలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు

రంజాన్ మాసంలో HYD నగరంలో 10 లక్షల బిర్యానీలు,5.3 లక్షల హలీమ్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 6 మిలియన్ ప్లేట్ల బిర్యాని ఆర్డర్లు వచ్చాయని, గతేడాదితో పోల్చితే 15% పెరిగిందని వెల్లడించింది. హైదరాబాద్,కోల్ కతా, లఖ్ నవూ, భోపాల్, మీరట్ నగరాల్లో కొనుగోళ్లను పరిశీలించగా…ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది.
Similar News
News March 20, 2025
HYDలో బొట్టు పెట్టుకున్న విశ్వ సుందరి!

మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా బేగంపేటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంప్రదాయంలో చీర కట్టు, బొట్టు పెట్టుకొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘నమస్తే ఇండియా’ అని పలకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడి ట్రెడిషన్ చాలా బాగా నచ్చింది అంటూ కితాబిచ్చారు.
News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
News March 20, 2025
రాజ్‌భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.