News April 11, 2024
HYD: రంజాన్ మాసంలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు

రంజాన్ మాసంలో HYD నగరంలో 10 లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీమ్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 6 మిలియన్ ప్లేట్ల బిర్యాని ఆర్డర్లు వచ్చాయని, గతేడాదితో పోల్చితే 15% పెరిగిందని వెల్లడించింది. హైదరాబాద్, కోల్కతా, లఖ్నవూ, భోపాల్, మీరట్ నగరాల్లో కొనుగోళ్లను పరిశీలించగా.. ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది.
Similar News
News December 23, 2025
మూడు కార్పొరేషన్లుగా మహానగరం..!

GHMCలో మున్సిపాలిటీల విలీనం అనంతరం మహానగరం 300 డివిజన్లకు పెరిగింది. అయితే ఇంత పెద్ద నగరానికి ఒకే కార్పొరేషన్ ఉండాలా లేక విభజించాలా అనే విషయాన్ని సర్కారు ఆలోచిస్తోంది. మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
News December 23, 2025
ఢిల్లీకి చేరువలో HYD పొల్యూషన్

HYDలో ఎయిర్ క్వాలిటీ ఢిల్లో పరిస్థితి దగ్గరలో ఉంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 300 ఉండగా.. నగరంలో డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ 270కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు తప్పనిసరిగా మాస్కులు ధరించడం మేలని, చిన్న పిల్లలను దీని నుంచి కాపాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
News December 23, 2025
మంగళవారం బల్కంపేట ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు చేశారు. అర్చకులు, వేద పండితులు అమ్మవారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలతో అభిషేకించారు. మంగళవారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.


