News December 1, 2024
HYD: రహదారులపై మతాల చిహ్నాలు తొలగించాలి: సంఘ సేవకులు

రహదారులపై వివిధ మతాల చిహ్నాలు రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడి నుంచి తరలించాలని ప్రముఖ సంఘ సేవకులు గంజి ఈశ్వర్ లింగం, టీ.రమేశ్ కోరారు. సిటిజన్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘రహదారులపై ఆటంకాలు, ప్రత్యామ్నాయాలు’ అనే అంశంపై ప్రత్యేక సమావేశం కమలానగర్‌లో ఆదివారం నిర్వహించారు. కోమటిరవి, యాదగిరిరావు, కర్రం మల్లేశం ఉన్నారు.
Similar News
News February 11, 2025
ఎల్బీనగర్: మైనర్ బాలికపై లైంగిక దాడి.. జీవిత ఖైదు

ఎనిమిదేళ్ల మైనర్ బాలికను మాయమాటలతో ఆశచూపి, అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ షేక్ జావీద్(27) దోషి అని తేలడంతో అతడిపై అత్యాచారం, పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదైంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు, రూ.25వేల జరిమానా, బాధితురాలకి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని తీర్పునిచ్చింది.
News February 11, 2025
HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
News February 11, 2025
HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!

ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.