News April 19, 2024
HYD: రాంగ్ రూట్లో ప్రయాణిస్తే కేసు

వాహనదారులు మీకో బ్యాడ్ న్యూస్. రాంగ్ రూట్లో వెళ్తే ఏం కాదని లైట్ తీసుకుంటే మాత్రం మీ పై ఐపీసీ 336 కింద కేసు నమోదవ్వడం ఖాయమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో రాంగ్ రూట్లో ప్రయాణించిన 23 మంది వాహనదారులు, ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Similar News
News October 20, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో దీపావళి పూజలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, అందమైన పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపావళి ప్రత్యేక హారతి, ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీప కాంతులతో ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
News October 20, 2025
హైదరాబాద్ ఊపిరిపీల్చుకో..!

పండగలొస్తే నగరం కొత్తగా కనిపిస్తుంది. బహుశా ఇలా అనుకుంటుందేమో? ఉదయాన్నే హారన్ల మోతలేక హాయిగా నిద్రలేచి సరికొత్త సూర్యోదయం చూశా. బండ్లు ఎక్కువగా తిరగక, కంపెనీలన్నీ బంద్ అవ్వడంతో స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకుంటున్నా. మెట్రో, బస్సుల్లో తిట్ల దండకాలు లేవు. ఉరుకులు పరుగులతో ప్రశాంతతలేని ముఖాలు కానరాలేదు. ఇలాంటి పండగల రోజు మళ్లా ఎన్నిరోజులకో..? అని ఎదురుచూస్తున్నట్లు మీకూ అనిపిస్తోందా!
News October 20, 2025
21న పోలీస్ అమరవీరుల సంస్మరణకు సీఎం రేవంత్: డీజీపీ

అక్టోబర్ 21 గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి హాజరవనున్నారని డీజీపీ శివధర్ తెలిపారు. కార్యక్రమం ఉ.9.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. అక్టోబర్ 21- 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.