News October 14, 2024

HYD: రాడార్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR

image

ఓ వైపు మూసీ నదికి CM మరణశాసనం రాస్తూ.. మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో తమపై రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని, జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.

Similar News

News November 24, 2024

HYDలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తి

image

HYD కలెక్టరేట్‌లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తయింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి రిజర్వేషన్లు కల్పించే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన వారు, వినతి పత్రాలు సైతం అందించినట్లుగా HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు.

News November 24, 2024

కోటి దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు

image

HYDలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవాన్ని కార్తికమాసం వేళ అద్భుతంగా నిర్వహించడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News November 24, 2024

ఓయూలో రాజకీయ సభలకు అనుమతివ్వొద్దు: BRSV

image

ఓయూలో ఎలాంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని BRSV రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. శనివారం ఓయూ ఉపకులపతి కుమార్‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. శాంతియుతంగా ఉన్న ఓయూలో రాజకీయ సభలు పెట్టి యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ చూస్తుందన్నారు. నూతన విద్యార్థులకు గ్రూప్ పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు.