News November 15, 2024
HYD: రాత్రిళ్లు మహిళల అసభ్య ప్రవర్తన.. హెచ్చరిక

హైదరాబాద్‌లోని ప్రధాన సర్కిళ్లలో పురుషుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా చైతన్యపురి PS పరిధిలో రాత్రి సమయంలో దారిన పోయే వ్యక్తులను ఇబ్బంది పెడుతున్న 9 మంది మహిళలను సరూర్‌నగర్ తహశీల్దార్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇక మీదట ఇలా ప్రవర్తిస్తే రూ.2 లక్షల జరిమానా, 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని MRO హెచ్చరించారు.
SHARE IT
Similar News
News November 14, 2025
జూబ్లీ బైపోల్: ఆ నలుగురిలో NOTA!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో NOTA ప్రధాన పార్టీల సరసన నిలిచింది. 58 మంది అభ్యర్థులతో పాటు పోటీ చేసిన NOTA ఫలితాల్లో 4వ స్థానం దక్కించుకుంది. INC, BRS, BJP తర్వాత అత్యధికంగా ఏ గుర్తుకైనా ఓట్లు వచ్చాయంటే అది నోటాకే. None of the Above అంటూ 924 మంది ఓటర్లు బటన్ నొక్కారు. ఇతర పార్టీల అభ్యర్థులతో సహా ఏ ఇండిపెండెంట్ కూడా నోటా ఓట్లలో 25 శాతం అయినా దక్కించుకోలేదు.
News November 14, 2025
GREAT: HYD విద్యార్థినికి అరుదైన గౌరవం

బేగంపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆకర్షణకు అరుదైన గౌరవం దక్కింది. బుక్ రీడింగ్‌పై విద్యార్థులకు ఆసక్తి కల్పించడమే కాక 24 లైబ్రరీలను వివిధ చోట్ల ఏర్పాటు చేసిన ఆకర్షణ యంగ్ అచీవర్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆకర్షణ ఈ అవార్డు అందుకోనుంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 24 లైబ్రరీలను ఏర్పాటుచేసింది. గతంలో ప్రధాని మోదీ కూడా ఈ విద్యార్థిని అభినందించారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో బీసీ నినాదం పనిచేసిందా..?

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ విజయానికి బీసీ నినాదం కూడా ప్రధానంగా పనిచేసిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. BRS అభ్యర్థి మాగంటి సునీత కమ్మ వర్గానికి చెందిన మహిళ కావడం, BJP అభ్యర్థి లంకల దీపక్.. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కావడం నవీన్ యాదవ్‌కు కలిసొచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓట్లతో పాటు మిగితా బీసీ ఓటర్లు నవీన్‌కే జై కొట్టారు. దీంతో భారీ మెజార్టీతో గెలిచారని వారు అంటున్నారు.


