News March 4, 2025
HYD: రాయదుర్గంలో యువతి సూసైడ్

రాయదుర్గంలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలు.. వికారాబాద్ జిల్లాకు చెందిన దేవిక(25), సతీశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాయదుర్గంలో కాపురం పెట్టారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి వాగ్వాదం పెట్టుకున్నారు. ఈ మనస్తాపంతో దేవిక ఉరివేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 4, 2025
మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు: సీపీ

మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ విభాగాల పోలీసు మహిళా అధికారులు పాల్గొన్నారు.
News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News March 4, 2025
HYD: ఇంటర్ పరీక్షలు.. ఇది మీ కోసమే!

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో 244, రంగారెడ్డిలో 185, మేడ్చల్ మల్కాజిగిరిలో 150 కలిపి మొత్తం 579 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో 4,64,445 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నగరంలోని అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 040-29700934కు కాల్ చేయండి.
SHARE IT