News January 3, 2025

HYD: రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

image

HYD: రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగింది. అదిలాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయిందని పేర్కొంది. తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని.. ఈ నేపథ్యంలోనే అదిలాబాద్, కుమురం భీం, నిర్మల్ జిల్లాలకు రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Similar News

News December 2, 2025

ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా: సీఎం

image

ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎంతో మంది ఉద్దండులను అందించిన ఓయూని కేసీఆర్ కాల గర్భంలో కలిపేశారు. యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతైనా ఖర్చు చేస్తా’ అని చెప్పారు. కాగా ఇప్పటికే ఓయూని సందర్శించిన రేవంత్ రెడ్డి భారీగా నిధులు కేటాయిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

News December 2, 2025

HYD: సర్పంచ్ ఎన్నికలే లక్ష్యం.. టీబీజేపీ దూకుడు

image

రాష్ట్రంలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో 1000 సీట్లు గెలవాలని టీబీజేపీ TBJP లక్ష్యంగా పెట్టుకుంది. జూబ్లీహిల్స్ బైపోల్ ఓటమి తర్వాత, పార్టీ ఈ వ్యవస్థీకృత కార్యాచరణను ప్రారంభించింది. ఈ ఎన్నికల ఖర్చును పూర్తిగా సిట్టింగ్, గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులే భరించాలని ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతాన్ని, నాయకత్వాన్ని బలోపేతం చేయడమే ఈ వ్యూహం ముఖ్యోద్దేశమని పార్టీ వర్గాలు తెలిపాయి.