News November 21, 2024
HYD: రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు
HYD నగరంలో శుక్రవారం రాష్ట్రపతి పర్యటన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్ఐఏ నుంచి ఐకియా వరకు, కేబుల్ బ్రిడ్జి నుంచి మీనాక్షి వరకు, మాదాపూర్ నుంచి కొత్తగూడ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.
Similar News
News December 5, 2024
HYD: పాన్ కార్డు కరెక్షన్స్.. ఇది మీ కోసమే!
HYD అమీర్‌పేట స్వర్ణ భారతి కాంప్లెక్స్ భవనంలో CSC హెడ్ ఆఫీసులో పాన్ కార్డు, పాస్ పోర్టు సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డులో పేరు, DOB మార్పులు చేర్పులు కూడా చేస్తామన్నారు. మిగతా సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.SHARE IT
News December 5, 2024
షాకింగ్: సికింద్రాబాద్‌లో మొండెంలేని శిశువు తల
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కళ్లు చెమర్చే సంఘటన వెలుగుచూసింది. జనరల్‌బజార్‌లోని బంగారం దుకాణాల కాంప్లెక్స్ వద్ద మొండెంలేని పసికందు తల లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు CC కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2024
HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు
55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.
SHARE IT