News August 12, 2024
HYD: రాష్ట్రపతి భవన్ నుంచి ఆకర్షణకు పిలుపు

ఈనెల 15 ఇండిపెండెన్స్‌డేన రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ రిసెప్షన్ కార్యక్రమానికి రావాల్సిందిగా 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణకు ఆహ్వానం అందింది. అనాథాశ్రమాలు, స్కూళ్లల్లో సొంతంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్న ఆకర్షణను ఇటీవల ప్రధాని మోదీ కూడా అభినందించారు. ఇప్పటివరకు 14 లైబ్రరీలను ఆకర్షణ ఏర్పాటు చేసిందని, మరిన్ని పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉందని తండ్రి సతీష్ తెలిపారు.
Similar News
News November 18, 2025
తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
News November 18, 2025
సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News November 18, 2025
సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.


