News December 10, 2024

HYD: రాహుల్, ప్రియాంక గాంధీని కలిసిన సీతక్క

image

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన మంత్రి సీతక్క, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ఇటీవల వయనాడ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News November 21, 2025

HYD: ఆర్టీసీ కార్మికులపై దాడిచేస్తే కఠిన చర్యలు: నాగిరెడ్డి

image

ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. విధినిర్వహణలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడులకు పాల్పడటం సహించరాని నేరమని అన్నారు. వారిపై దాడులు చేస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సంస్థ పరంగా కార్మికులకు పూర్తి భద్రత, భరోసా ఉంటుందని నాగిరెడ్డి హామీ ఇచ్చారు.

News November 21, 2025

HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

image

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్‌లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 21, 2025

రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నోటీసులు

image

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.