News May 5, 2024
HYD: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

HYD నగరంలో రోజు రోజుకూ భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2015లో నమోదైన అత్యధిక 44.3° డిగ్రీల రికార్డు నిన్న బ్రేక్ అయింది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.10 రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఎండలకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు.
Similar News
News September 16, 2025
HYD: అక్టోబర్ 1 నుంచి రేషన్ షాపులు బంద్!

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని HYD లక్డీకపూల్లోని పౌర సరఫరా శాఖకు రేషన్ డీలర్లు సమ్మె నోటీసులు ఇచ్చారని సమాచారం. OCT 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ఈ సంఘం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్లు సమ్మె బాట పడుతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా వారు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
News September 16, 2025
ఓయూ: 22 నుంచి నూతన కోర్సు ప్రారంభం

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని ది సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెయినింగ్(సెల్ట్)లో ‘ఇంగ్లిష్ కమ్యునికేషన్ స్కిల్స్& పర్సనాలిటీ డెవలప్మెంట్’ కోర్సు ప్రారంభిస్తున్నారు. తరగతులు సా.6 నుంచి 7:30 గంటల వరకు ఉంటాయి. ఆసక్తిగల వారు ఈ నెల 20లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెల్డ్ డైరెక్టర్ ప్రొ.సవీన్ సౌద తెలిపారు. 7989903001 నంబరుకు ఫోన్ చేయొవచ్చు.
# SHARE IT
News September 16, 2025
HYD: నేటి నుంచి TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

నేటి నుంచి TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయ్యనున్నారు. రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. గత 20 రోజులుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం ఆయాయి. దీంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 330 ఆస్పత్రులకు గత 12 నెలలుగా బకాయిలు పెండింగ్ ఉండడంతో వెంటనే చెల్లించాలని సేవలు నిలిపివేయన్నున్నారు.