News May 11, 2024
HYD: రిజర్వేషన్ల రద్దుకు BJP కుట్ర: CM రేవంత్‌రెడ్డి

దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ముందుకెళ్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. శనివారం HYD పటాన్‌చెరులో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 50 వేల మెజారిటీతో నీలం మధును గెలిపించాలని కోరారు.
Similar News
News January 21, 2026
విద్యార్థులకు ALERT.. ఏకలవ్య పాఠశాలల్లో ADMISSIONS

TGలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 1380 సీట్లను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 29న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు https://tsemrs.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT.
News January 21, 2026
HYD: ఈ నగరానికి ఏమైంది.. ఒకేరోజు 3 హత్యలు..?

వరుస హత్యలతో HYD హడలెత్తుతోంది. అక్రమ సంబంధాలు, గంజాయి మత్తు మానవత్వాన్ని దహించేస్తోంది. మంగళవారం జరిగిన 3 హత్యలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. జవహర్ నగర్‌లో గంజాయి మత్తులో కన్నతల్లినే కొడుకు కిరాతకంగా హతమార్చాడు. కూకట్‌పల్లిలో జల్సాలకు అడ్డొస్తున్నాడని భర్తను ఉరేసి ఉసురు తీసింది కసాయి భార్య. బోరబండలో భార్యపై అనుమానంతో రోకలి బండతో కొట్టి చంపాడో <<18912212>>దుర్మార్గపు భర్త.<<>> నేరచీకట్లలో నగరం కమ్ముకుపోతోంది.
News January 21, 2026
HYD: వందేళ్లు దాటినా.. చెక్కుచెదరని ‘ప్యాలెస్ రాజసం’

HYD.. తన గుండెలపై ఘన చరిత్రను మోస్తోంది. చెక్కుచెదరని వందలేళ్ల చారిత్రక కట్టడాలు కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయి. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు 126 ఏళ్లు నిండినా, నేటికీ అదే వైభవంతో వెలిగిపోతోంది. విఖార్ ఉల్ ఉమ్రా నియో-క్లాసికల్ శైలిలో నిర్మించిన ఈ రెండంతస్తుల భవనం 4ఎకరాల్లో విస్తరించింది. 1975-2008 వరకు HUDA కార్యాలయంగా, 2023 వరకు అమెరికా కాన్సులేట్‌గా సేవలందించింది. త్వరలో HMDA ఆఫీస్‌గా మారనుంది.


