News March 4, 2025

HYD రియల్ ఎస్టేట్‌లో 45% వాటా మనదే..!

image

HYDలో రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అత్యధిక రిజిస్ట్రేషన్లతో మేడ్చల్ జిల్లా వాటా 45%గా ఉందని సగటు చదరపు అడుగు ధర రూ.3494గా రికార్డయిందని, రంగారెడ్డి జిల్లాలో 41% రిజిస్ట్రేషన్లు జరిగాయని సగటు చదరపు ధర రూ.4713 నమోదయందని HYD జిల్లా వాటా 14%గా ఉన్నట్లు నైట్‌ఫ్రాంక్ సంస్థ తెలిపింది.

Similar News

News March 24, 2025

క్యాన్సర్ కేసులపై ప్రచారంలో నిజం లేదు: మంత్రి

image

AP: రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో 105 మందికి క్యాన్సర్ సోకినట్లు తేలిందని చెప్పారు. బ్రెస్ట్, సర్వైకల్, బ్లడ్, ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అనపర్తిని యూనిట్‌గా తీసుకొని ఇప్పటివరకు 1.19 లక్షల మందికి స్క్రీనింగ్ చేశామన్నారు.

News March 24, 2025

KMR: దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

పెండింగ్‌లో ఉన్న ధరణీ దరఖాస్తులను పరిశీలించి డిస్పోజ్ చేయాలని తహశీల్దార్లు, ఆర్డీఓలును సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సిద్ధంగా ఉంటే వెంటనే మార్క్ అవుట్ ఇవ్వాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాలని, ఎంపీడీవోలు, ఎంపీఓలు పర్యవేక్షించాలన్నారు.

News March 24, 2025

జగిత్యాల: ఇంగ్లిష్ పరీక్షకు 8 మంది గైర్హాజరు

image

జగిత్యాల జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా మూడోరోజు ఇంగ్లిష్ పేపర్ రెగ్యులర్ పరీక్షకు మొత్తం 11845 విద్యార్థులకు 11839 విద్యార్థులు హాజరయ్యారు. ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల హాజరు శాతం 99.95% ఉండగా.. సప్లమెంటరీ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కేంద్రాలలో 27 విద్యార్థులకు 25 మంది విద్యార్థులు గైర్హజరయ్యారు. వీరి హాజరుశాతం 85.19%. ఉంది అని అధికారులు తెలిపారు.

error: Content is protected !!