News July 7, 2024
HYD: రూట్లతో 132 ఎకరాల్లో HMDA లేఅవుట్!

HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.
Similar News
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2025
KPHB: OYOలో పోలీసుల RAIDS

KPHBకాలనీలోని హోటళ్లలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తాజాగా రోడ్ నం.3లోని OYO హోటల్లో రైడ్స్ చేశారు. ఈ సోదాల్లో 6 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు కాకినాడకు చెందిన జ్యోతి, అజయ్ (27), రమేశ్ (28)గా గుర్తించారు. APలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకు విక్రయిస్తున్నారు. OYOలో రూమ్ అద్దెకు తీసుకొని మరీ వ్యాపారం మొదలుపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
News November 5, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ఓటేసిన 97 మంది

జూబ్లీహిల్స్లో మంగళవారం హోం ఓటింగ్కు మంచి స్పందన వచ్చింది. 97 మంది వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోం ఓటింగ్ కోసం మొత్తం 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 95 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ స్ఫూర్తితోనే నవంబర్ 11న కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆశిద్దాం.


