News July 7, 2024

HYD: రూట్లతో 132 ఎకరాల్లో HMDA లేఅవుట్!

image

HYD శివారులో రూ.96 కోట్లతో లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు HMDA కసరత్తు మొదలుపెట్టింది. ఘట్‌కేసర్ మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ఒకే చోట 132 ఎకరాలను భూ యజమానులు HMDAకు అప్పగించారు. భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు సర్వే పూర్తి చేసి లేఅవుట్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన పనులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారు.

Similar News

News February 15, 2025

ఎల్బీనగర్‌లో పోలీసుల కష్టాలు! (PHOTO)

image

ఎల్బీనగర్ కోర్టు ప్రాంగణంలో రాచకొండ ఆర్మ్ రిజర్వుడ్ పోలీసుల కష్టాలు వర్ణనాతీతం. ఖైదీలను తీసుకొని వెళ్లిన ప్రతిసారి ఇదే పరిస్థితి. కోర్టు ప్రాంగణంలో లంచ్ చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం ఒక షెడ్ నిర్మించాలని రాచకొండ పోలీసులను ఓ వ్యక్తి ‘X’ వేదికగా కోరారు. నిబంధనల ప్రకారం సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని రాచకొండ పోలీసులు బదులిచ్చారు.

News February 15, 2025

HYD: రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు.. వివరణ!

image

న‌ల్గొండ (D) అక్కంప‌ల్లి బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్లో చనిపోయిన‌ కోళ్లను వేసిన‌ట్లు సోషల్ మీడియా ప్రచారంపై HYD జలమండలి స్పందించింది. ఇక్కడి నుంచి నీరు మహానగరానికి సరఫరా అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అయింది. కాగా స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. స్పెషల్ టీం నీటి పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు లభించలేదని, ఆందోళన అవసరం లేదని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

News February 15, 2025

సంత్ సేవాలాల్ మహారాజ్‌కు నివాళులు అర్పించిన సీఎం

image

బంజారాజాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్ నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో వారి అధికారిక నివాసంలో సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.

error: Content is protected !!