News October 6, 2024
HYD: రూ.100 కోట్ల అండర్ ట్యాంకుల నిర్మాణం

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల వ్యయంతో 50 ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల వరద నీటి నిల్వ సామర్థ్యం కలిగిన అండర్ ట్యాంక్స్ నిర్మిస్తోంది. GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపిన వివరాల ప్రకారం.. ముఖ్యమైన 18 చోట్ల భూగర్భ ట్యాంకులు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నగరంలో వరద నీరు నిలిచే 141 ప్రాంతాలను 50కి తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
GHMC ఎన్నికలకు సిద్ధం కావాలి: KTR

ఓడిన చోటే గెలిచి చూపిద్దామని, GHMC ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సూచించారు. బుధవారం HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దొంగ ఓట్లు, అక్రమాలతోనే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు.
News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.


