News April 7, 2024

HYD: రూ.13,13,950 నగదు సీజ్: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.13,13,950 నగదు, రూ.2,34,159 విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 22.44 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు. నగదు ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని తెలిపారు.

Similar News

News November 25, 2024

HYD: తెలుగులో భారత రాజ్యాంగం

image

HYDలోని రెడ్ హిల్స్ వద్ద ఉన్న సూరన ఆడిటోరియంలో భారత రాజ్యాంగ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి DSP చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని, భారత పౌరులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

News November 25, 2024

HYD: లోక్‌మంథన్ ఫెస్టివల్ ఘనంగా ముగింపు

image

శిల్పకళ వేదికలో లోక్‌మంథన్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. వనవాసి గ్రామవాసి, నగరవాసి అందరూ భారతీయులే అని తెలిపారు. దేశ సంస్కృతి ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శించారని చెప్పారు. దేశంలో స్వార్థం ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్‌రెడ్డి, గజేంద్ర శెఖావత్ పాల్గొన్నారు.

News November 25, 2024

HYD: అక్రమ కనెక్షన్లపై ఫిర్యాదు చేయండి: MD

image

HYDలో జ‌ల‌మండ‌లి అధికారుల నుంచి అనుమ‌తి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవ‌రేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవ‌రేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఈ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలను కోరారు.