News March 19, 2024
HYD: రూ.16,43,300 నగదు పట్టివేత: కమిషనర్

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్ టీమ్స్ మంగళవారం రూ.16,43,300 నగదుతో పాటు రూ.10,250 విలువగల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేశారని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పోలీస్, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ టీమ్స్ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 12, 2025
HYD: పిల్లాడిని ఎత్తుకెళ్లారు.. ఇద్దరి అరెస్ట్

HYD కాచిగూడలో మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టు అయ్యింది. 2 నెలల మగ శిశువును కాచిగూడ పోలీసులు వారి నుంచి రక్షించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కాచిగూడ డీమార్ట్‌లో బట్టలు కొనడానికి వెళ్లిన తల్లి, బట్టలు సెలెక్ట్ చేయడానికి బాబును పట్టుకొమ్మని నిందితుడికి ఇచ్చింది. దీంతో నిందితుడు అతడి తల్లి, బాబుతో ట్యాక్సీలో పరారవగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
News February 12, 2025
HYD: 9000113667 ఈ నంబర్‌కు కాల్ చేయండి..!

చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబర్‌ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. ఇప్పటి వరకు 48 కేసులు కాగా రాత్రీపగలు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.
News February 12, 2025
17వ తేదీ నుంచి ఓయూ సెల్ట్ తరగతులు

ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవిన్ సౌడ తెలిపారు. రెండు నెలల ఈ కోర్సుకు ప్రతిరోజూ ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 79899 03001, 98497 52655 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.