News February 18, 2025
HYD: రూ.183 కోట్లు బాధితులకు తిరిగి ఇవ్వడం రికార్డు: మంత్రి

గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో జరిగిన షీల్డ్-2025 సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.350 కోట్లు ఫ్రీజ్ చేసి రూ.183 కోట్లు బాధితులకు తిరిగి ఇవ్వడం రికార్డని, డిజిటల్ యుగంలో కొత్త అడుగులతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయన్నారు.మనదేశంలో దాదాపు రూ.15 వేల కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారన్నారు.
Similar News
News March 23, 2025
ఫిలింనగర్: తల్లి డైరెక్షన్‌లో కొడుకుల చోరీ

ఫిలింనగర్ PS పరిధిలో ఇటీవల డైమండ్‌హిల్స్ కాలనీలో 32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ అయింది. లేడీ డాన్ సనా బేగం ఈ చోరీ చేయించి, 10 తులాల బంగారం విక్రయిస్తూ రెండో కొడుకు సొహాయిల్‌తో సహా పట్టుబడింది. మిగిలిన ఇద్దరు కొడుకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సనాపై ఇప్పటివరకు 43 చోరీ కేసులు ఉన్నాయి. తల్లి డైరెక్షన్ ఇస్తే కొడుకులు రంగంలోకి దిగి చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
News March 23, 2025
వర్షం ఎఫెక్ట్.. RRలో తగ్గిన ఎండ తీవ్రత

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత చాలా తగ్గింది. వర్షం నేపథ్యంలో జిల్లాలోని చుక్కాపూర్లో 37.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. కాసులాబాద్, చందనవెల్లి 37.6, మహేశ్వరం, మొగలిగిద్ద 37.5, రెడ్డిపల్లె 37.4, ప్రొద్దుటూరు 37.3, దండుమైలారం 37.1, కేతిరెడ్డిపల్లి 37.1, మొయినాబాద్ 36.8, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, HYD విశ్వవిద్యాలయం 36.5, చంపాపేట్, గచ్చిబౌలి 36.4, అల్కాపురి 36.3, మంగళపల్లె 36.3℃ఉష్ణోగ్రత నమోదైంది.
News March 23, 2025
ఆకట్టుకున్న అద్భుత నృత్యప్రదర్శనలు

ప్రఖ్యాత నాట్యకళాసంస్థ అభినయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాత్రి రవీంద్రభారతిలో నాట్యప్రవాహ శీర్షికన అభినేత్రి గురు ప్రమోద్ కుమార్ రెడ్డి, భారత రంగస్థల ఆకాడమీ గురు కోకా విజయలక్ష్మి, నృత్యాలయం గురు ఎన్.లక్ష్మి, రందుల కూచిపూడి నాట్యనిలయం గురు జి.రవిల 80మంది శిష్యులు వివిధ అంశాల అద్భుత నృత్యప్రదర్శనలతో ఆశేష కళాప్రియులను ఆకట్టుకున్నారు.