News September 13, 2024
HYD: రూ.2.94 కోట్ల బంగారం సీజ్..!

HYD నగర శివారు శంషాబాద్ ORR ఏరియాలో 3.98 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపుగా రూ.2.94 కోట్లు ఉంటుందని వెల్లడించారు. విదేశానికి చెందిన ఈ బంగారం.. కోల్కతా నుంచి తీసుకొస్తుండగా HYD నగరంలో పట్టుబడింది. కారు సీటు వెనక బ్రౌన్ టేపు వేసి, బంగారం దాచినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 2, 2025
రంగారెడ్డి: ‘స్కాలర్షిప్నకు దరఖాస్తులు చేసుకోండి’

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎస్సీ విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తారని రంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రామారావు తెలిపారు. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉండాలని సూచించారు.
News October 31, 2025
HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

రాజ్ భవన్లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
News October 30, 2025
RR : రేషన్ బియ్యం వేలం.. ఎక్కడో తెలుసా..?

జిల్లాలో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెరను సేకరించి అక్రమంగా వ్యాపారం చేసే వారి వద్ద నుంచి జప్తు చేసిన 947.496 MTల బియ్యం, 25.50 క్వింటాళ్ల గోధుమలు, 247కిలోల చక్కెర NOV18 న బహిరంగ వేలం వేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎక్సైజ్ శాఖ ద్వారా అనుమతి పొందిన ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్ DCSO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


