News December 17, 2024

HYD: రూ.24,269 కోట్లతో మెట్రో నిర్మాణం..!

image

HYD మెట్రో ఫేజ్-2 పార్ట్-Aలో రూ.24,269 కోట్ల అంచనాతో మెట్రో కారిడార్ల నిర్మాణం జరుగుతుందని HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది.ఇప్పటికే పాత బస్తీ మెట్రో పనుల వేగం పుంజుకుంది.4.నాగోల్,శంషాబాద్ రూ.11,226 కోట్లు, 5.రాయదుర్గం,కోకాపేటకు రూ.4,318 కోట్లు,6.పాతబస్తీకి రూ.2,741 కోట్లు, 7.మియాపూర్ పఠాన్ చెరువు మార్గానికి రూ.4,107 కోట్లు, 8.ఎల్బీనగర్ హయత్ నగర్ మార్గానికి రూ.1,877 కోట్లు ఖర్చు అవనుందని తెలిపింది.

Similar News

News October 9, 2025

స్థానిక సమరం.. రంగారెడ్డి రెడీ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో నేటి నుంచి MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదల కానుంది. రంగారెడ్డి జిల్లాలో 21 ZPTC స్థానాలు, 230 MPTC స్థానాలు ఉన్నాయి. అక్టోబర్‌లో 2 విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. నవంబర్ 11న ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక జిల్లాలో మొత్తం 526 పంచాయతీలు ఉండగా.. 4,668 వార్డులు ఉన్నాయి.

News October 7, 2025

రంగారెడ్డి: ఓటర్లను మచ్చిక చేసుకుంటున్న ఆశావహులు

image

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు కొద్ది సంవత్సరాలుగా పట్టణాల్లో నివాసముంటున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో గ్రామాల బాట పట్టారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

News October 7, 2025

రంగారెడ్డి జిల్లా పరిషత్ పీఠం ఎవరికి దక్కేనో..?

image

రంగారెడ్డి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లాలోని కందుకూరు, షాబాద్ మండలాల్లో ఎస్సీ మహిళలకు రిజర్వ్‌డ్ కావడంతో అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంది.