News February 3, 2025

HYD: రూ.250 కోట్లతో 88 నూతన సబ్‌స్టేషన్లు..!

image

HYD మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాలకు చెందిన జోన్లలో ఒక్కోజోన్లలో నిర్మించాల్సిన సబ్ స్టేషన్ల కోసం టెండర్లు పిలవాల్సి ఉంది. రూ.250 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 88 విద్యుత్ ఉపకేంద్రాలను జోన్లవారిగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే వేసవి డిమాండ్ మేరకు చర్యలు చేపడుతున్నారు.

Similar News

News January 16, 2026

GHMC రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు 40% స్థానాలు

image

GHMC పరిధిలోని 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్ చేసింది. 2011 జనాభా లెక్కలు, BC డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. BCలకు 122 స్థానాలు కేటాయించారు. పురుషులు, మహిళలకు సమానంగా చెరో 61 సీట్లు ఇచ్చారు. SCలకు 23 (M-12, F-11), STలకు 5 (M-3, F-2) స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళలకు 76, అన్‌రిజర్వుడ్‌గా 74 స్థానాలు ప్రకటించారు. మొత్తంగా మహిళలకు 150 స్థానాలు దక్కాయి.

News January 16, 2026

భిక్కనూర్: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బిక్కనూరు మండలం జంగంపల్లిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాడి నరసింహులు(53) ఇటీవల కొత్త ఇల్లు నిర్మించగా, అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆయన, గురువారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.