News May 11, 2024
HYD: రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్

HYD బాచుపల్లిలో ఇటీవల గోడ కూలి మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జన్ సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్పీ సింగ్ డిమాండ్ చేశారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాచ్‌పల్లిలో ఈనెల 10న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందారని, పలువురు గాయపడ్డారని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ RECORD

జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అదే ఏడాది జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి TDPపై 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ దానిని బీట్ చేయలేకపోయారు. కానీ నవీన్ యాదవ్ ఈ ఉపఎన్నికలో 24,729 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో BRS ఓటమికి కారణాలివే?

జూబ్లీహిల్స్‌లో BRS ఓటమికి కొన్ని కారణాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే..
1.KCR ప్రచారానికి రాకపోవడం(కార్యకర్తల్లో నిరాశ)
2.బస్తీలకి చేరని SM పోస్టులు(మాస్ జనం దూరం)
3.నవీన్ యాదవ్ సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడం
4.పోల్ మేనేజ్మెంట్లో విఫలం
5.సింపతి కలిసిరాకపోవడం
6.మాగంటి ఫ్యామిలీలో కలహాలు(గోపీనాథ్ తల్లి, మొదటి భార్య కొడుకు స్టేట్మెంట్)
News November 14, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్ గెలుపు.. కలిసొచ్చినవి ఇవే!

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపునకు అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందులో అతి ముఖ్యమైనవి పరిశీలిస్తే..
1.రేసుగుర్రం నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం (కలిసొచ్చిన స్థానికత)
2.స్టార్ క్యాంపెయినర్‌గా CM ప్రచారం (ప్రజల్లో చైతన్యం)
3.అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం(మైనార్టీలు INCకి మొగ్గు)
4.MIM మిత్రపక్షం
5.గల్లీల్లో మంత్రుల పర్యటన.. బస్తీల్లో అభివృద్ధి మంత్రం
6.పోలింగ్ మేనేజ్మెంట్లో సక్సెస్


