News July 12, 2024
HYD: రూ.5,979 కోట్ల నష్టాల్లో మెట్రో

HYD నగరంలో 2017లో ప్రారంభమైన మెట్రో రైలులో 2024 ఫిబ్రవరి వరకు 50 కోట్ల మంది రాకపోకలు సాగించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. అయితే ఆరేళ్లుగా HYD మెట్రో తీవ్ర నష్టాల్లోనే ఉన్నట్లు వివరించారు. 2022 మార్చి 31 నాటికి రూ.4,108.37 కోట్ల నష్టాలు, అలాగే 2023 మార్చి 31 నాటికి రూ.5,424.37 కోట్లకు పెరిగాయని, 2024 మార్చి 31 నాటికి రూ.5,979.36 కోట్లకు చేరినట్లు స్పష్టం చేశారు.
Similar News
News February 13, 2025
పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్: మంత్రి

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. HYD విశ్వనగరమని, పెట్టుబడులకు గమ్యస్థానమని అన్నారు. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
News February 13, 2025
హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.
News February 13, 2025
గౌలిదొడ్డి: JEEలో గౌలిదొడ్డి విద్యార్థుల ప్రభంజనం

RR జిల్లా గౌలిదొడ్డి గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షలో ప్రభంజనం సృష్టించారు. 99.03 పర్సంటైల్ సాధించి మణిదీప్ అనే విద్యార్థి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చరణ్ తేజ్, తేజస్విని, రామ్‌చరణ్, శ్రీనివాస్, భాను తేజ, నేహాలత, నిహారిక టాప్ ర్యాంకులు సాధించినట్లు రెసిడెన్షియల్ అధికారులు తెలిపారు. ఒకే పాఠశాల నుంచి ఇంత మంది టాప్ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు.