News March 23, 2024
HYD: రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న అసోసియేషన్

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైయిరీ, ఐడీ, హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం HYD ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుందన్నారు.
Similar News
News October 15, 2025
జూబ్లీహిల్స్: సాదాసీదాగా సునీత నామినేషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్ కార్యాలయంలో KTRతో కలిసి ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
News October 15, 2025
ఎన్నికల చిత్రం: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

ఎన్నికల వేళ పార్టీలు మారడం సహజమే. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నాయకులు కండువాలు మార్చేస్తున్నారు. మస్కటి డైరీ డైరెక్టర్ అలీ మస్కటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు TDP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి BRSలో చేరారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత నాని ఆ పార్టీని వదిలి నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
News October 15, 2025
జూబ్లీ బైపోల్: క్రిటికల్ లొకేషన్.. పోలీసులకు టెన్షన్

జూబ్లీహిల్స్ బైఎలెక్షన్ పోలీసులకు కాస్త టెన్షన్‌గా మారింది. నియోజకవర్గంలో 139 లొకేషన్లలో 407 పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 139 ప్రాంతాల్లో 57 ప్రాంతాలను క్రిటికల్ లొకేషన్లుగా పోలీసులు గుర్తించారు. బోరబండ PS పరిధిలో 27, మధురానగర్ లిమిట్స్‌లో 18, జూబ్లీహిల్స్‌లో1, పంజాగుట్టలో 5, టోలిచౌకి 2, గోల్కొండ 2, సనత్‌నర్లో 2 ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేశారు.