News August 31, 2024

HYD: రెయిన్ అలర్ట్‌.. మేయర్ సమీక్షా సమావేశం

image

రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాల కురిసే అవకాశమున్నందున హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం GHMC కమిషనర్ ఆమ్రపాలి, వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల పట్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర సేవలకై 040-21111111, 9000113667 నంబర్లలకు‌ సంప్రదించాలన్నారు.

Similar News

News September 16, 2025

నేడు HYDకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

image

నేడు హైదరాబాద్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. SEP 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు హాజరవుతారు. పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

News September 15, 2025

కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

image

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్‌పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్‌పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.

News September 15, 2025

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర: కేటీఆర్

image

జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర మొదలవ్వాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ఆగం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.