News September 9, 2024

HYD: రేపటి కోసం.. కొత్త నగరం..!

image

భవిష్యత్ నగరానికి బంగారు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. HYD సమీపంలో తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’కి నగరం నుంచి రాకపోకలు చేసేందుకు వీలుగా నాలుగు విధాలుగా మార్గాలను అధికారులు సూచించారు. వీటన్నిటినీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ)కి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇందులో రెండు మెట్రో రైలు రూట్‌లు, మరో రెండు ఎలక్ట్రిక్ బస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మార్గాలున్నాయి.

Similar News

News October 8, 2024

HYD: రూ.1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్

image

తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ.1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్‌ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్‌కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.

News October 7, 2024

HYD: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

image

HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్ PS పరిధిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా (కుడి) బాషాTGRTCలో అసిస్టెంట్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.

News October 7, 2024

HYDలో కోటికి చేరనున్న వాహనాల సంఖ్య!

image

HYDలో రాబోయే పదేళ్లలో వాహనాల సంఖ్య కోటి దాటనుందని నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఆ స్థాయిలో రోడ్లు విస్తరణకు, నిర్మాణానికి నోచుకోక, ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్య నివారణకు ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమిటీకి’ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నడుంబిగించారు. ట్రాఫిక్, ఐటీ విభాగాల అదనపు కమిషనర్లు ఈ కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు.