News August 11, 2024
HYD: రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బీఎస్సీ (హన్స్) మొదటి ఏడాది ప్రవేశం కోసం ఈ నెల 12న ఆన్ లైన్‌లో అప్లికేషన్లు తీసుకుంటామని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఈఏపీసెట్- 2024 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినులు ఆన్లైన్ https://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News September 14, 2024
HYD: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య
భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్‌కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది.
News September 14, 2024
HYD: CM రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ..!
✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్‌పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.
News September 14, 2024
HYD: సెప్టెంబర్ 17న సెలవు.. ఆరోజు రావాల్సిందే!
గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలు HYD, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9 రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు.