News July 6, 2024
HYD: రేపటి నుంచి బోనాలు.. గుడిలో అధ్వాన పరిస్థితి!

ఫిలింనగర్లోని బసవతారకనగర్ బస్తీలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు అమ్మవారి ఆలయ ప్రహరీ కూలిపోయింది. వరదలకు నిర్మాణంలో ఉన్న రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. కనీసం మరమ్మతులు కూడా చేయలేదని స్థానికులు వాపోతున్నారు. రేపటి నుంచి నగరంలో బోనాలు మొదలుకానున్నాయి. ఇలా అయితే పండుగ ఎలా జరుపుకోవాలని బస్తీ వాసులు నిలదీస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 27, 2025
గాంధీ భవన్ వైపు రంగారెడ్డి నేతల చూపు

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. అయితే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఎందుకు అధ్యక్షా? అని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీసీసీ చీఫ్ పోస్టు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికేతరుడిని నియమిస్తున్నారని తెలియడంతో పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపిక వాయిదా పడిందని సమాచారం.
News November 27, 2025
HYD: చేతిరాత బాగుంటుందా? మరెందుకు ఆలస్యం

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.
News November 27, 2025
GHMCలో విలీనం.. 2 రోజుల్లో GO?

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తామని సర్కారు ప్రకటించడంతో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. విలీనానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా విలీన ప్రక్రియ ముగించాలని సీఎం ఆదేశించారు.


