News March 2, 2025
HYD: రేపటి నుంచి మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు

మెట్రో గ్రీన్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను రేపటి నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. లింగంపల్లి – మెహిదీపట్నం రూట్లో ప్రతిరోజు 4 బస్సులు రాకపోకలు సాగించనున్నాయని, లింగంపల్లి నుంచి మొదటి బస్సు ఉదయం 6:50 గం.లకు బయలుదేరుతుందన్నారు. చివరి బస్సు రాత్రి 10:10 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. మెహదీపట్నం నుంచి మొదటి బస్సు ఉ.8 గంటలకు, చివరి బస్సు రాత్రి 11 గంటలకు బయలుదేరనుందన్నారు.
Similar News
News September 19, 2025
SKLM: దివ్యాంగుల నుంచి ఫిర్యాదుల స్వీకరించిన కేంద్ర మంత్రి

దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని వినతులు స్వీకరించారు. శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యల విని, పడుతున్న కష్టాలను చూసి ఆయన చలించిపోయారు. దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC, అధికారులు పాల్గొన్నారు.
News September 19, 2025
కేసీఆర్కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

TG: ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.
News September 19, 2025
వారాహి పీఠం కాదు.. వారాహి దేవస్థానం

కాకినాడ రూరల్ కొవ్వూరులో వివాదస్పదమైన వారాహి పీఠంను ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వారాహి పీఠం బోర్డు తొలగించి వారాహి దేవస్థానంగా అధికారులు నామకరణం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలను దేవస్థానాలుగా పిలుస్తారని.. అందుకే పీఠం పేరు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.