News June 15, 2024
HYD: రేపటి నుంచి రవీంద్రభారతిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థుల పెయింటింగ్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు HYD రవీంద్రభారతిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారందరూ ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్ చూడాలని కోరారు.
Similar News
News September 16, 2025
HYD: ఎకరా రూ.101 కోట్లు.. ఇది బేస్ ప్రైజే..!

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే అక్టోబర్ 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం రాబోతుందని అంచనా. నగరంలో అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ భూములపై ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
News September 16, 2025
నేడు HYDకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్

నేడు హైదరాబాద్కు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. SEP 17 సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే విమోచన దినోత్సవాలకు హాజరవుతారు. పలువురు కేంద్రమంత్రులు, మహారాష్ట్రకు చెందిన మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
News September 15, 2025
కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య.. జైలుకు నిందితులు

కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్లేక్ అపార్ట్మెంట్లో జరిగిన రేణు అగర్వాల్ హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. రాంచీ నుంచి నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మను పోలీసులు కూకట్పల్లికి తీసుకొచ్చారు. ట్రాన్సిట్ వారెంట్పై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది. కంది జైలుకు తరలించినట్లు సమాచారం.