News May 12, 2024

HYD: రేపు జూబ్లీహిల్స్‌లో ఓటేయనున్న సినీ ప్రముఖులు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. HYD జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి కుటుంబ సభ్యులు ఓటేయనుండగా ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్ NTR, ప్రణతి, BSNL సెంటర్‌లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఓటేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మహేశ్ బాబు, నమ్రత, మోహన్ బాబు, విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి తదితరులు ఓటేయనున్నారు. 

Similar News

News February 18, 2025

HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

image

మేడ్చల్‌లో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు హత్యలు జరిగాయి. ఇటీవలే పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23) హత్య జరగ్గా, ఆదివారం రాత్రి వెంకటరమణ అనే వ్యక్తిని మైనర్ బాలుడు అయిన అతని అల్లుడు హత్య చేశాడు. వరుస హత్యలతో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

News February 18, 2025

HYD: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. HYDలో వివిధ సంఘాలు సమావేశం అయ్యాయి. ఛత్రపతి సేవలు నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ప్రతీ హిందువు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నారు. హిందువుల మనోభావాలకు అనుకూలంగా ఆయన జయంతి (ఫిబ్రవరి 19)కి సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

News February 18, 2025

HYDలో రూ.150 కోట్లతో సుందరీకరణ పనులు

image

HYD ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లతో 106 ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టింది. షేక్‌పేట్, జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 78 ప్రాజెక్టులు పూర్తి కాగా, మిగిలినవి ప్రగతిలో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో పనులు వేగంగా సాగుతున్నాయి.

error: Content is protected !!