News December 4, 2024

HYD: రేపు డెక్కన్ ఎరీనాలో హోరాహోరీ మ్యాచ్

image

అజీజ్‌నగర్‌లో ఐ – లీగ్ (ఫుట్ బాల్) పోటీలు జరగనున్నాయి. డెక్కన్ ఎరీనాలో రేపు (గురువారం) రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనుంది. హైదరాబాద్ తరఫున శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనున్న నేపథ్యంలో మ్యాచ్‌కి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News November 24, 2025

రేపు GHMC పాలకమండలి సమావేశం!

image

GHMC 12వ సాధారణ సమావేశాన్ని రేపు ప్రధాన కార్యాలయంలో నిర్వహించనుంది. ఐదేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుత పాలక మండలికి జనవరిలో చివరి సమావేశం ఉంటుందని GHMC వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లలో GHMCలో 146 మంది ఉన్నారు. BRS–40, MIM–41, INC–24, BJP–41 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు మరణించడం, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో 4 స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.

News November 24, 2025

చర్లపల్లి టెర్మినల్‌కు ఈ రోడ్డు వేస్తే తిరుగేలేదు!

image

SCR సేవలకు వేదికైనా చర్లపల్లి టెర్మినల్‌ సక్సెస్ సాధించింది. ఈ స్టేషన్‌ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. మేడ్చల్ జిల్లాతో పాటు సిటీ శివారులోని ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉప్పల్ నుంచి చర్లపల్లి రోడ్లు తయారయ్యాయి. ఈ రోడ్లను బాగు చేస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

News November 24, 2025

HYD సిటీ కంటే ‘సింగారం’ బెస్ట్

image

పట్నంలో ఇరుకు రహదారులు, ట్రాఫిక్‌తో ప్రజలు విసిగిపోతున్నారు. విశాల ప్రాంతమైన సిటీ శివారు ప్రతాపసింగారానికి షిఫ్ట్ అవుతున్నారు. పట్నానికి 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడ ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫోసిస్-ORR సమీపం కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ప్రయాణ సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 130 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది.